కొండాపూర్, జూలై 10 : డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీలో తలెత్తిన డ్రైనేజీ సమస్యను డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి పరిశీలించారు. కొద్దిరోజులుగా వేముకుంటలో తలెత్తిన డ్రైనేజీ సమస్యను తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. నియోజకరవ్గ వ్యాప్తంగా ఎక్కడాఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు రాజు, నరేంద్ర బల్లా, యూసఫ్, రవి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటన..
ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి డివిజన్ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వరద ముంపు ప్రాంతాలైన దీప్తిశ్రీనగర్, శాంతినగర్, పీజేఆర్ నగర్ కల్వర్టు, గ్యాస్ గోదాం, జవహర్ కాలనీ, వేముకుంటలలో పరిస్థితిని పరిశీలించినట్లు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ముందస్తు జాగ్రత్తలు ఎంతో మేలు చేశాయని, భవిష్యత్తులోనూ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, ఎస్ఆర్పీ కనకరాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సమన్వయం వ్యవహరించాలి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆయా విభాగాలు సమన్వయంతో పూర్తి స్థాయి సన్నద్ధతతో పని చేయాలని తద్వారా ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ముంపు సమస్యలు పునరావృతం కాకుండా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. మియాపూర్ డివిజన్ బొల్లారం దారిలో వరద ప్రభావ ప్రాంతాలలో ట్రాఫిక్ ఏసీపీ హన్మంతరావు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి విప్ గాంధీ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారులపై ఎక్కడా వర్షపు నీరు నిల్వకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నాలాలు, డ్రైనేజీలలో వ్యర్థాలను ఎప్పటికపుడు తొలగిస్తూ నీరు సాఫీగా వెళ్లేలా పటిష్టంగా వ్యవహరించాలన్నారు. మాన్సూన్ బృందాలు నిత్యం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. మ్యాన్హోళ్ల మూతలను తెరిచి ఉంచకుండా చూడాలని గాంధీ సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం జాప్యం లేకుండా అటెండ్ కావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శంకర్, ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, ట్రాఫిక్ సీఐ సుమన్, ఎస్ఆర్పీ కనకరాజు పాల్గొన్నారు.