కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 10 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నగరం తడిసిముైద్దెంది. రెండ్రోజులుగా సూర్యుడే కనిపించకుండా కురుస్తున్న వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నీటి ప్రవాహానికి అక్కడక్కడా అడ్డంకులు ఏర్పడుతుండడంతో వెంటనే జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగిస్తున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న అత్యవసర బృందాలను జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తూ ఆయా ప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. వర్షంనీటిలో రాత్రి పగలు తేడా లేకుండా బృందాలు సహాయక చర్యల్లో సేవలందిస్తున్నారు. భారీ వర్షాలు కురిసినా విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూకట్పల్లి జంట సర్కిళ్ల అధికారులు తెలిపారు.
రంగంలో అత్యవసర బృందాలు ..
ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు అత్యవసర బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో 15 బృందాలు ఉండగా.. కూకట్‌పల్లిలో 8, మూసాపేటలో 7 బృందాలు పని చేస్తున్నాయి. డివిజన్ స్థాయి బృందాలతో పాటు సర్కిల్ స్థాయి బృందాలు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. వర్షం కురిసిన వెంటనే నీరు నిలిచే ప్రాంతాలకు వెళ్లి నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించడం, సెల్లార్లలో నీటిని తొలగించే పనులను చేస్తున్నారు. ప్రత్యేక వాహనాలలో సామాగ్రితో కూడిన బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు అందిస్తున్నాయి.
ఫోన్ చేసి చెప్పండి..
జంట సర్కిళ్ల పరిధిలో ముంపు సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. వర్షంనీటి కాలువల సమీపంలో, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ముంపు సమస్యలు ఎదురైతే వెంటనే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని కోరుతున్నారు. సర్కిళ్ల వారీగా కంట్రోల్ రూమ్‌లలో ప్రజలనుంచి 24 గంటలు ఫిర్యాదులు స్వీకరించేందుకు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. మీ కాలనీలు, బస్తీలలో ముంపు సమస్యలు ఎదురైతే వెంటనే కింది కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలి జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు రవికుమార్, రవీందర్‌కుమార్‌లు తెలిపారు.
మూసాపేట సర్కిల్లో..
పతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఎం.సునీత: 9700005858
పతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 వరకు మహదేవ్: 9550590774
ఞుపతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 వరకు గంగస్వామి: 9000554764
కూకట్పల్లి సర్కిల్లో..(సోమ, గురువారం)
6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు సుజాత: 9949039532
2 గంటల నుంచి రాత్రి 10 వరకు వినాయకరావు: 9849902560
10 గంటల నుంచి ఉదయం 6 వరకు బలరామ్: 9849855797
(మంగళ, శుక్రవారం)
6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మహిపాల్ రెడ్డి: 9959447333
2 గంటల నుంచి రాత్రి 10 వరకు గురువారెడ్డి : 9059481621
10 గంటల నుంచి ఉదయం 6 వరకు విజయ్‌కుమార్ : 9701524738
(బుధ, శని, ఆదివారం)
6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు శ్రవణ్: 9000543075
2 గంటల నుంచి రాత్రి 10 వరకు ముస్తఫా : 998575955
10 గంటల నుంచి ఉదయం 6 వరకు రవి : 9989068270