కాచిగూడ, జూలై 10: దేశంలో ఎక్కడ లేని విధంగా దళితులను కోటీశ్వరులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని నింబోలిఅడ్డా ప్రాంతానికి చెందిన లబ్ధిదారుడు శ్రీనివాస్ దళితబంధు పథకం ద్వారా నింబోలిఅడ్డాలో ఆదివారం ఏర్పాటు చేసిన కిరణాషాపును ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ ఉమా రమేశ్యాదవ్తో కలిసి ప్రారంభించాడు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితులు ఆర్థికంగా ఎదిగి, వారి కుటుంబాలల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తున్నాడని అన్నా రు. దళితబంధు పథకంతో ఏర్పాటు చేసుకున్న వ్యాపారాల ద్వారా మరో జీవితానికి శ్రీకారం చుట్టాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల బతుకులు మారాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టాడని, ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు, సునీల్బిడ్లాన్, కన్నె రమేశ్‌యాదవ్, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర భీష్మాదేవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్, డాక్టర్ ఓంప్రకాశ్యాదవ్, బి.కృష్టాగౌడ్, విజితారెడ్డి, దాత్రిక్ నాగేందర్బాబ్జి, శేషుపేరి, మహేశ్‌కుమార్,బబ్లూ, అంటోని, రామచంద్రరాజు, ఎల్. రమేశ్, పట్లూరి సతీశ్, భీంరాజ్ పాల్గొన్నారు.
సంచార జాతుల మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
ఈ నెల 16వ తేదీన ఇందిరాపార్కు వద్ద నిర్వహించబోయే సంచార జాతుల మహాధర్నా పోస్టర్‌ను ఆదివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆవిష్కరించారు. ఆ ధర్నాకు హాజరు కావాలని కూడా ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్, అధ్యయన కమిటీ చైర్మన్ వెంకటనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగజోగి శ్రీనివాస్, నాయకులు సరికొండ సమ్మయ్య పాల్గొన్నారు.