సిటీబ్యూరో, జూలై 8 (నమస్తేతెలంగాణ):నిరుపేద కుటుంబాలకు చెందిన దివ్యాంగులు, వృద్ధులకు ఉచితంగా ఉపకరణాలు, కృత్రిమ అవయవాలు అందించేందుకు అలియ్కో సంస్థ సహకారంతో బల్దియా ముందుకొచ్చింది. నగరవ్యాప్తంగా ఎంతమందికి, ఎన్ని ఉపకరణాలు అవసరమున్నాయో గుర్తించేందుకు జూన్ 20న ప్రారంభమైన శిబిరాలు ఈనెల 7న ముగిశాయి. రోజుకు 2 సరిళ్ల చొప్పున జరిగిన శిబిరాల్లో 5389 మంది పేర్లు నమోదు చేసుకోగా, 4649 మంది ఎంపికయ్యారు. గుర్తింపు శిబిరాలు నిర్వహించిన ప్రదేశాల్లోనే త్వరలో ఉపకరణాలు పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు.
పంపిణీ చేసే ఉపకరణాలు ఇవే..
బ్రెయిలీ కిట్, ఎంఎస్ఐఇడి కిట్/ఎంఅర్ కిట్, క్రచ్ ఎల్బో పరికరం, సంకర్ర, బ్రెయిలీ డీలక్స్, రోలోటేర్స్, స్మార్ట్ కెన్, డైసీప్లేయర్, ఏడియల్ కిట్(లెప్రసి), సర్వైకల్ కాలర్స్, వీల్‌చైర్స్, ఎల్ఎస్ బెల్ట్, ట్రైసైకిల్, సీపీ చైర్, ఇయరింగ్ ఎయిడ్, క్యాలిపర్స్.
అర్ధరాత్రి సీపీ తనిఖీ
నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు పాతబస్తీలోని పలు పోలీస్ చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. బక్రీద్ సందర్భంగా
పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయగా, వీటి వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరు ఆరాతీశారు. అప్రమత్తంగా ఉండాలని, ఘటన జరిగితే వెంటనే వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.