ఎర్రగడ్డ, జూలై 8: అన్ని విధాలా వెనుకబడ్డ దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అనతి కాలంలోనే దళితుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. బోరబండ డివిజన్లో ‘దళితబంధు’ పథకం ద్వారా మంజూరైన కారును లబ్ధిదారుడైన శ్రావణ్‌కు శుక్రవారం ఎమ్మెల్యే అందజేశారు. అదే డివిజన్‌కు చెందిన మరో లబ్ధిదారుడు భరత్‌కు మంజూరైన టెంట్హౌజ్ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ.. సర్కారు సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణలోని లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. బోరబండ డివిజన్లో దళితబంధుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లలో అర్హులందరికీ దశలవారీగా యూనిట్లు మంజూరు అవుతున్నాయని భరోసా ఇచ్చారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోరబండ రూపురేఖలు పూర్తిగా మారాయనటానికి గత 7 ఏండ్లలో జరిగిన అభివృద్ధే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, ఇన్చార్జి సయ్యద్సిరాజ్, కోఆర్డినేటర్ విజయసింహ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ధర్మ, నేతలు లక్ష్మణ్‌గౌడ్, ఏడీ మధు, సరళ, డేవిడ్, ఆనంద్, రవి పాల్గొన్నారు.
క్రికెట్ పోటీలు ప్రారంభం
వెంగళరావునగర్: మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నాకౌట్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వెంగళరావునగర్ డివిజన్ క్రికెట్ పోటీలను గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్ నుంచి రెండు జట్ల చొప్పున నియోజకవర్గ స్థాయి పోటీలో ఉంటాయని పేర్కొన్నారు. డివిజన్ స్థాయి విజేత జట్టుకు రూ.10 వేలు చొప్పున బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయి పోటీలో విజేత జట్టుకు రూ.2 లక్షల బహుమతి ఉంటుందన్నారు . కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్యరావు, డివిజన్ అధ్యక్షుడు కోనేరు అజయ్, నేతలు వేణు, వేణుగోపాల్‌యాదవ్, విజయ్ ముదిరాజ్ పాల్గొన్నారు.