కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 8 : ప్రజలు ఆరోగ్యవంతులుగా జీవించడానికి ఓపెన్ జిమ్‌లు చక్కని వేదికలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లి డివిజన్ నల్లచెరువు పార్కులో రూ.15 లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్‌ను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలో జీవిస్తున్న ప్రజలు మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలన్న లక్ష్యంతో పార్కులను అభివృద్ధి చేస్తూ.. ఓపెన్ జిమ్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. కాలనీలు బస్తీలలో నివసించే ప్రజలు ప్రైవేట్ జిమ్‌లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని.. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. స్థానిక ప్రజలు ఓపెన్ జిమ్‌ను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు, ప్రకాశ్‌నగర్ అధ్యక్షుడు నర్సింగ్సాయి, శేషాద్రినగర్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, శాంతకుమార్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్, సురేశ్‌బాబు, బచ్చలి శ్రీను, వెంకటేశ్, నాగరాజు, సురేశ్, శ్రీను, మల్లేశ్, కుమార్ న్నారు.
దేశంలోనే గొప్ప పథకం ‘దళిత బంధు’
మూసాపేట, జూలై8: దళితబంధు దేశంలోనే గొప్ప పథకం అని, లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట డివిజన్‌కు చెందిన దళితబంధు లబ్ధిదారులు మన్నె యాదగిరి, బాలమణి, శివకుమార్, రాములులకు శుక్రవారం డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్‌తో కలసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పుకోసం సీఎం చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి పథకం ప్రయోజనాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. లబ్ధిదారులు తమ ఇష్టమైన రంగంలో రాణించి దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగడంతో పాటు జీవితంలో స్థిరపడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయంగా కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బోట్టు విష్ణు, ఇనుగంటి రాజు, ప్రభకర్, వంశీయాదవ్, రవివర్మ పాల్గొన్నారు.