పెట్రోలు, డీజిల్ ధరలు చాలవన్నట్లు కేంద్రంలోని బీజేపీ సర్కారు గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచి సామాన్యుల నడ్డివిరిచింది. తాజాగా రూ.50 పెంచడంతో నగరంలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1105కి చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రావడంతో గ్రేటర్‌వ్యాప్తంగా కేంద్రం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల వాతతో నిత్యావసరాలు, కూరగాయలు, రవాణా, ఇతర ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ గురువారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నగరంలో తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన కూడళ్లల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, కూకట్పల్లి తదితర చోట్ల ‘బైబై మోదీ..చాలయ్య మోదీ’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకర్షిస్తున్నాయి. యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఖైరతాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఇతర ప్రజాప్రతినిధులు నిరసన తెలిపారు.
-సిటీబ్యూరో, జూలై 7 (నమస్తేతెలంగాణ)
వంటింట్లోని గ్యాస్‌బండ ప్రజలకు గుదిబండగా మారుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు సామాన్యుల కొంపలో కుంపటి పెడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలతో ఇప్పటికే ప్రతి రోజు ప్రజల నడ్డివిరుస్తున్న కేంద్రం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను కూడా అమాంతం పెంచింది. అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో చాలా సార్లు పెంచిన బీజేపీ సర్కారు తాజాగా మరో రూ.50 పెంచడంతో నగరంలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1105కి చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రావడంతో గ్రేటర్ వ్యాప్తంగా కేంద్రం తీరుపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ గురువారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఖైరతాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఇతర ప్రజాప్రతినిధులు నిరసన తెలిపారు.
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పేదలపై మోయలేని భారాన్ని మోపుతున్నదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ విమర్శించారు. గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచటాన్ని గురువారం ఆయన ఖండించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యుల బతుకులు దినదిన గండంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.