సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్ ఫేజ్ – 2 తాగునీటి పనుల్లో వేగం పెంచాలని అధికారులను జలమండలి ఎండీ దాన కిశోర్ ఆదేశించారు. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓఆర్ఆర్ – 2 పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. డిసెంబరులోపు రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి కావాలని ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. వీటితో పాటు ఇన్ లెట్ , ఔట్లెట్ పనులు కూడా పూర్తి చేయాలని, డిస్ట్రిబ్యూషన్ లైన్ పనులు కూడా సమాంతరంగా చేపట్టాలని సూచించారు.
పైప్‌లైన్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు కచ్చితంగా పాటించాలని ఎండీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జలమండలి టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్ , సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మురుగునీటిని శుద్ధికి ఎస్టీపీల నిర్మాణంలో భాగంగా ప్యాకేజ్ – 1లో అంబర్‌పేట వద్ద 212.50 ఎంఎల్డీ సామర్థ్యంతో నూతనంగా నిర్మిస్తున్న సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) పనులను జలమండలి ఎండీ దాన కిశోర్ గురువారం పరిశీలించారు.