మన్సూరాబాద్, జూలై 7: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రజలపై మోపిన గ్యాస్ భారం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలు జీవించలేని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలోఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్‌పై రూ. 760 పెంచాడని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెంటనే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం విధానాలపై ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఓ సైనికుడిలా పోరాడుతాడని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మల్లేశం, దయానంద్ గుప్త, మాజీ కార్పొరేటర్లు విఠల్‌రెడ్డి, వజీర్ ప్రకాశ్‌గౌడ్, సంగీత, రాజశేఖర్ రెడ్డి, తిరుమల్‌రెడ్డి, జీవీ సాగర్‌రెడ్డి, శ్రీనివాసరావు, రమావత్ పద్మానాయక్, భవానీ ప్రవీణ్‌కుమార్, పలు డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు మల్లారెడ్డి, చిరంజీవి, అరవింద్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్, శ్రీశైలంయాదవ్, వరప్రసాద్‌రెడ్డి, కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ ఈశ్వరమ్మయాదవ్, నాయకులు వెంకటేశ్‌గౌడ్, ప్రశాంత్‌గౌడ్, విశ్వేశ్వర్ రావు,జగదీశ్‌యాదవ్, నాగరాజు, జగన్మోహన్రెడ్డి, సతీష్‌యాదవ్, రాజుగౌడ్, యాదగిరి, కృష్ణ, రాంచంద్రారెడ్డి, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.