చంపాపేట/మన్సూరాబాద్, జూలై 7: వానకాలంలో లోతట్టు ప్రాంతాల్లో వరదముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సెంట్రల్బ్యాంకు కాలనీలో రూ. 42.80లక్షలతో నూతనంగా చేపట్టనున్న వరదనీటి పైపులైన్ పనులు, మల్లికార్జుననగర్ నార్త్ కాలనీలో రూ. 17.50 లక్షలతో ప్రభుత్వ స్థలానికి నిర్మించనున్న ప్రహరీ నిర్మాణ పనులకు, చంపాపేట డివిజన్ పరిధిలోని రాజిరెడ్డి కాలనీ, రెడ్డిబస్తీ, కటికోనికుంటలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు, దుర్గాభవానీ నగర్, సాయిరాం నగర్ కాలనీ, కుమ్మరి బస్తీ, ఎస్జీఆర్ కాలనీ, సుల్తాన్ వాల్వాలో రూ.75లక్షలతో సీసీరోడ్డు ప్యాచ్‌వర్క్ పనులకు గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా పెరుగుదలకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి భవిష్యత్తులో కాలనీల్లో మరుగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చంపాపేటలోని చిలకల బస్తీలో డ్రైనేజీ పైప్‌లైన్ ఏర్పాటు పూర్తి అయిందని, త్వరలో సీసీ రోడ్డు నిర్మించేలా చూస్తానన్నారు. ఇప్పటికే వరద నీటి సమస్య పరిష్కారం కోసం మారుతీనగర్ కాలనీ నుంచి, డీ మార్ట్ షాపింగ్ మాల్ వరకు రూ.7కోట్లతో నిర్మిస్తున్న వరద నీటి కాలువ పనులు కొనసాగుతున్నాయన్నారు. మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో పెండింగ్‌లో ఉన్న మైనర్ పనులు త్వరలో పరిష్కరిస్తానన్నారు.
శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ నర్సింహరెడ్డి, మాజీ కార్పొరేటర్ విఠల్‌రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మల్లారెడ్డి, కర్మన్‌ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఈశ్వరమ్మయాదవ్, నాయకులు రఘువీర్‌రెడ్డి, జగదీశ్‌యాదవ్, వెంకట్‌రెడ్డి,యాదగిరి, వెంకన్న కురుమ, చంద్రమోహన్, జగదీశ్‌గౌడ్, కరుణాకర్, శంకరయ్య, యాదయ్య, భాస్కర్‌యాదవ్, ఆనంద్,శ్రీధర్‌గౌడ్, జగన్,చంపాపేట డివిజన్లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌రెడ్డి, మహిళా వింగ్ అధ్యక్షురాలు రోజారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, రఘుమారెడ్డి, మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ కృష్ణమచారి,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.