ఖైరతాబాద్, జూలై 7 : పంజాగుట్టలోని 108 వాహనాన్ని హైదరాబాద్ జిల్లా కోఆర్డినేటర్ రత్నమయ్య గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. వాహనంలోని ప్రాథమిక చికిత్స పరికరాలు, మెడికల్ కిట్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. అత్యవసర సేవలు అందిస్తున్న 108 వాహనంలో మరింత మెరుగ్గా స్పందించి అమాయకుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉంటుందని రత్నమయ్య తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎమర్జెన్సీ టెక్నిషియన్ టీ శ్రీనివాస్, ఫైలెట్ రమేశ్‌కు సూచించారు.