వెంగళరావునగర్, జూలై 7 : ప్రధాని మోదీ దేవుడు కాదు..దయ్యమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎద్దేవా చేశారు. గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా గురువారం యూ సుఫ్‌గూడ చౌరస్తాలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు గ్యాస్ బండలతో, కట్టెలతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ బీజేపీ పేదల వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. గ్యాస్ ధర పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి మహిళలు అవస్థలు పడ్తున్నారన్నారు. గ్యాసే కాకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూపోతున్నారని..బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలతో పేదల నడ్డి విరుస్తున్నారని..కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం తెస్తామని అన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్పొరేటర్లు దేదీప్య విజయ్, రాజ్‌కుమార్ పటేల్, సీఎన్.రెడ్డి, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, మన్నె కవితారెడ్డి, జీటీఎస్ దేవాలయం చైర్మన్ చిన్న రమేశ్, మాజీ కార్పొరేటర్ శ్యామ్ ముదిరాజ్,వేణుగోపాల్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, ప్రదీప్, సంతోష్ ముదిరాజ్, సంజీవ,కృష్ణమోహన్, మన్సూర్, విజయ్ కుమార్, తన్ను ఖాన్, విజయ్ సింహ, సిరాజ్, పవన్ ముదిరాజ్, సత్యనారాయణ, కిట్టు తదితరులు పాల్గొన్నారు.
వెంగళరావునగర్, జూలై 7 : యూసుఫ్‌గూడ చౌరస్తాలో కార్పొరేటర్ దేదీప్య విజయ్, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ మోదీ 8 ఏండ్ల పాలనలో 170 శాతం గ్యాస్ ధర పెరిగిందని..ఇప్పుడు ఏకంగా రూ.50 ధర పెంచడంతో పేదలు అల్లాడిపోతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక కేంద్ర సర్కారు నిర్ణయాలపై తిరుగుబాటు చేస్తామని..గ్యాస్ ధరలు తగ్గించకుంటే బీజేపీ మెడలు వంచుతామని హెచ్చరించారు. డివిజన్ అధ్యక్షుడు కొనేరు అజయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి వేణు, జీటీఎస్ ఆలయ చైర్మన్ చిన్న రమేశ్, మాజీ కార్పొరేటర్ శ్యామ్ రావు, వేణుగోపాల్ యాదవ్, కిట్టి, సత్యనారాయణ, పవన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్,జూలై7: యూసుఫ్‌గూడ కూడలిలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి ఆయా డివిజన్ల కార్యకర్తలతో కలిసి కేంద్ర ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ల వద్ద బై.. బై.. మోదీ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ ముదిరాజ్, మన్సూర్, నాయకులు కళ్యాణి, గీతాగౌడ్, ఖైసర్జాన్, ప్రసన్న, సబిత, రమాదేవి తదిరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ, జూలై 7: యూసుఫ్‌గూడ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాకు ఎర్రగడ్డ, బోరబండ డివిజన్ల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. బోరబండ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, ఇన్చార్జి సయ్యద్సిరాజ్, ఏడీ మధు, ధర్మ, వసంతరావు, ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, సుమోరాజు, మహేందర్, సయ్యద్స్రూల్, అజీమ్, కల్యాణి తది తరులు పాల్గొన్నారు.