మెహిదీపట్నం, జూలై 7 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో దళితుల్లో ఆనందం పెరిగిందని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ అన్నారు. గురువారం టోలిచౌకిలో దళితబంధు పథకం లబ్ధిదారులకు కార్లు, సెంట్రింగ్ సామన్లను, టెంట్‌హౌస్ సామన్లను ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్, కార్పొరేటర్లు ఎండీ.నసీరుద్దీన్, స్వామి యాదవ్, ఎంఐఎం కార్పొరేటర్ల ప్రతినిధులు మహ్మద్ హరూన్ ఫర్హాన్, వజీఉజ్జమాసిద్దిఖీ, బద్రుద్దీన్లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం నాయకులు, లబ్ధిదారులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందుతున్నాయన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు.
ప్రజలకు ప్రభుత్వ పథకాలతో ఆపద సమయాల్లో ఆర్థిక చేయూత లభిస్తుందని ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ అన్నారు. టోలిచౌకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ప్రజలు పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ అన్నారు. ఈనెల 10న గోల్కొండ బోనాల నాలుగో పూజ, బక్రీద్ పండుగ ఉండటంతో గురువారం గోల్కొండ కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్, అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, జీహెచ్ఎంసీ సర్కిల్-13 డిప్యూటీ కమిషనర్ వి.నర్సింహలతో కలిసి పర్యటించారు. బోనాల నాలుగో పూజ సందర్భంగా లంగర్‌హౌస్ మార్కెట్, గోల్కొండ ఛోటాబజార్, బడాబజార్ల మీదుగా తొట్టెల ఊరేగింపులు ఉంటాయని, అదేసమయంలో బక్రీద్ సందడి ఉంటుందని స్థానికులు ఎమ్మెల్యే, అధికారులకు వివరించారు. ఈనేపథ్యంలో పోలీస్ బందోబస్తుతోపాటు జంతువుల వ్యర్థాల తరలింపుపై పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించారు. గోల్కొండ బోనాలకు అంతర్జాతీయ ఖ్యాతి ఉందని, ఈ బోనాలను హిందూ, ముస్లింలు కలిసి జరుపుకుంటుండటంతో హైదరాబాద్ మతసామరస్యానికి ప్రతీక అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆదివారం బోనాలను, బక్రీద్ పండుగలను సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ ప్రజలను కోరారు. ఈకార్యక్రమంలో ఆసిఫ్‌నగర్ ఏసీపీ ఆర్జీ శివమారుతి, సంఘ సేవకులు, మైత్రి, పీస్ కమిటీ అధ్యక్షులు సిరుగుమల్లె రాజువస్తాద్, జైనుల్లా ఆబెదిన్ ఆబేద్, జనార్దన్, జంగయ్య, అక్బర్ పాల్గొన్నారు.