ముషీరాబాద్/ కవాడిగూడ, జూలై 7: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరుస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అచ్చేదిన్ అం టే ధరలు పెంచడమేనా ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం కవాడిగూడలోని ప్రాగాటూల్స్ చౌరస్తాలో టీఆర్ఎస్ ముషీరాబాద్ నియోజక వర్గం ఆధ్వర్యంలో పెంచిన ధరలను నిరసిస్తూ సిలిండర్లతో పెద్ద ఎత్తున నిరసన ధర్నాను నిర్వహించారు. బై బై మోదీ, బీజేపీ డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి దిగిపోయే రో జులు దగ్గరపడ్డాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి గడిచిన 8 ఏండ్లలో వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేదల నడ్డివిరిచిందని అన్నా రు. దేశాన్ని అంబానీ, ఆదానీలకు తాకట్టుపెడుతూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, వై. శ్రీనివాస్‌రావు, శ్యామ్యాదవ్, రాకేశ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, మోజెస్, నర్సింగ్ ప్రసాద్, పరశురామ్, ఉమాకాంత్ ముదిరాజ్, వల్లాల శ్రీనివాస్‌యాదవ్, కల్వగోపీ, రాజేశ్ పాల్గొన్నారు.
భోలక్‌పూర్ డివిజన్ పరిధిలో గల కృష్ణానగర్‌లో ఉన్న ఖాళీ స్థలాన్ని కబ్బాకు గురికాకుండా ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. ఈ మేరకు గురువారం భోలక్‌పూర్‌లోని కృష్ణానగర్‌లో వివాదంగా మారిన ఖాళీ స్థలం అని కోర్టు నుంచి తీర్పు రావడంతో కాలనీ కమిటీ స్థానిక ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ డీఈ సన్ని, ఏఈ తిరుపతిలను కాలనీకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పు పత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ గేట్‌ను ఏర్పాటు చేసి కబ్జాకాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ముషీరాబాద్, జూలై 7: అడిక్‌మెట్ డివిజన్ విద్యానగర్ ఎస్బీఐ వీధిలో త్వరలో డ్రైనేజీ పైపులైన్, రోడ్డు నిర్మా ణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. గురువారం ఆయన జలమండలి జీఎంతో కలిసి విద్యానగర్‌లో పర్యటించారు. స్థానికంగా తలెత్తుతున్న డ్రైనేజీ సమస్యల తీరును జీఎం శ్రీధర్‌రెడ్డికి వివరించి వెంటనే పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. జలమండలి డీజీఎం వాహబ్, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, అడిక్‌మెట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.సురేందర్, ముచ్చకుర్తి ప్రభాకర్, మల్లికార్జున్‌రెడ్డి, మహ్మద్ ఖదీర్, సయ్యద్ అస్లాం, అబ్బు, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.