దుండిగల్,జూలై 7: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్‌ను ప్రజల పాలిట గుదిబండగా మార్చిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నారు. వంట గ్యాస్ ధరను కేంద్రప్రభుత్వం మరో రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ గురువారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండిమైసమ్మ చౌరస్తాలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేశారు. వందలాది మంది కార్యకర్తలు, మహిళలు చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు వంటగ్యాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచి సామాన్యప్రజల నడ్డివిరిచిందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, నిజాంపేట మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్రాజు, దుండిగల్ మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్కృష్ణ, శంకర్‌నాయక్, సత్యనారాయణ, భరత్‌కుమార్, బండారి మహేందర్ యాదవ్, సాయియాదవ్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు మంత్రిసత్యనారాయణ, జగన్, రావులశేషగిరి, మాజీ జడ్పీవైస్‌చైర్మన్ బొంగునూరి ప్రభాకర్‌రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు కొలన్గోపాల్రెడ్డి, జీ.సురేశ్‌రెడ్డి, దశరథ్ నాయకులు పాల్గొన్నారు.
పెంచిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ చింతల్లో టీఆర్ఎస్ మహిళా నాయకులు చేపట్టిన ఆందోళనలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంట గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతే సామాన్య, మధ్య తరగతి ప్రజలు పస్తులుండాల్సి వస్త్తుందని, ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని, మరోపక్క గ్యాస్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తున్నదని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, వివధ డివిజన్ల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాచుపల్లి మండలం, సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో పెంచిన వంటగ్యాస్ ధరలకు నిరసనగా ప్రగతినగర్‌లోని మూడుకోతుల బొమ్మల చౌరస్తావద్ద పలువురు కార్యకర్తలు, నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం మండల పార్టీ కార్యదర్శి వెంకటరామయ్య, నేతలు బాలవెంకటేశ్వరరావు, వెంకటరాజు, ఎన్.బాలపీరు, చంద్రశేఖర్, శంకర్రావు, చెన్నయ్య, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.