ఘట్కేసర్, జూలై 7 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని టీఆర్ఎస్ నాయకుడు చామకూర భద్రారెడ్డి అన్నారు.గురువారం ఘట్కేసర్ మున్సిపాలిటీ 9వ వార్డులో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం భద్రారెడ్డి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్క లు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్, కమిషనర్ వసంత, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి,వార్డు కౌన్సిలర్ హేమలత, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్, సీఐ ఎన్.చంద్రబాబు, విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, జూలై 7 : ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి సంరక్షించాలని చౌదరిగూడ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ అన్నారు. పంచాయతీ పరిధిలోని నల్ల నర్సింహా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన హరితహారంలో సర్పంచ్ మొక్కలు నాటి నీరు పోశారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ సీవీ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, డీన్లు జనార్దన్ రాజు, కృష్ణమోహన్, రవీందర్రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారులు రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.
హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో అరుణ తెలిపారు. కాచవానిసింగారం పంచాయతీ పరిధిలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, ఉపాధి హామీ పనులు, మొక్కలు నాటే కార్యక్రమాలను గురువారం ఎంపీడీవో పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.