వనస్థలిపురం, జూలై 5: ఏండ్ల తరబడి తమకు పార్కు వస్తుందని ఎదురుచూస్తున్న ప్రజల ఆశ నెరవేరింది. కోర్టు తీర్పుతో పార్కు ఏర్పాటు చేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చొరవను కొనియాడారు. హస్తినాపురం డివిజన్ హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలోనిది ఈ సంఘటన. లేఅవుట్ వేసిన సమయంలో 1.30ఎకరాలను పార్కు కోసం కేటాయించారు. కొంత కాలం తర్వాత అది పార్కు అని కాలనీవాసులు, తమ సొంతమని పట్టాదారులు గొడవలు పడ్డారు. 2012లో విషయం కోర్టుకు వెళ్లింది. తాజాగా పార్కు నిర్మించాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇరు వర్గాలతో చర్చించి పార్కు నిర్మించాలని సూచించారు. ప్రహరీ నిర్మాణానికి రూ.37లక్షల నిధులను మంజూరు చేయించారు. మంగళవారం భారీ బందోబస్తుతో వచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ప్రజా అవసరాల కోసమే పార్కు ..
కొన్నేండ్లుగా ఇక్కడ పార్కు కావాలని స్థానక ప్రజలు కోరుతున్నారని, వారి అవసరాల కోసమే పార్కు నిర్మాణం చేస్తునామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎకరం 30గుంటల స్థలంలో అత్యాధునిక పార్కు నిర్మాణం జరుగుతుందన్నారు. పట్టాదారులతో మాట్లాడి వారి సమస్యను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామని, రెండు మూడు రోజుల్లో పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాలనీవాసులు పర్యవేక్షణ చేసి నాణ్యతతో పనులు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మాశ్రీనూనాయక్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మేరెడ్డి ఉదయ్‌కుమార్‌రెడ్డి, నారబోయిన శ్రీనివాస్‌యాదవ్, కాలనీ కార్యదర్శి గోదల శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, కోశాధికారి వై.శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు యాదయ్యగౌడ్, చంద్రశేఖర్, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ సంఘాలు.. అభివృద్ధికి కృషిచేయాలి
కాలనీ సంక్షేమ సంఘాలు అభివృద్ధికి కృషి చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. వనస్థలిపురం డివిజన్ ఎఫ్‌సీఐ కాలనీ నూతన కమిటీ ఎన్నికైన విషయం విధితమే. మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీ నాయకులు మంగళవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించి ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల సమగ్రాభివృద్ధికి తాను నిరంతరం పనిచేస్తున్నాన్నారు. సంక్షేమ సంఘాలు భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు సిరిగిరి రామ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆది నర్సింహారావు, కోశాధికారి రాజూయాదవ్, పోరెడ్డి వెంకట్‌రెడ్డి, పల్లె వాణి తదితరులు పాల్గొన్నారు.