బేగంపేట్ జూలై 5: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలకు రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఆలయ కమిటీ, ఈవో మనోహార్‌రెడ్డి మంగళవారం కలిసి ఆహ్వానించారు. మంగళవారం మారేడ్‌పల్లిలోని నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి దంపతులకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ క్రమంలో వేద పండితులు మంత్రి దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, ఆలయ ట్రస్టీ కామేశ్, సభ్యులు పాల్గొన్నారు.
దక్కన్సేవా సమితి సేవలు అభినందనీయం..
మహంకాళి జాతర సందర్భంగా దక్కన్ మానవ సేవా సమితి నూతన అధ్యక్షుడు బాల సుందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను తన నివాసంలో మర్యాద పూర్వకంగ కలిశారు. బాలసుందర్ను మంత్రి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 17న నిర్వహించే జాతర, 18న రంగం సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. భక్తులకు డెక్కన్ మానవ సేవాసమితితో పాటు పలు సేవా సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆలయం వద్ద రోడ్ల నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు, అవన్నీ జాతర నాటికి పూర్తవుతాయని తెలిపారు. మంత్రి వ్యక్తిగత నిధులతో నిర్మించిన 2 ఆర్చీలను 15న ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శీలం ప్రభాకర్, జనరల్ సెక్రటరీ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.