Asian Games 2026 : జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడలు 2026 క్రికెట్ నాకౌట్ బెర్తులు ఖరారయ్యాయి. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీకోసం గురువారం డ్రా తీయగా భారత పురుషుల జట్టు నేరుగా నాకౌట్‌కు దూసుకెళ్లింది. టీమిండియాతో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సైతం క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. మహిళల విభాగంలోనూ భారత్ సహా నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్ ఆడనున్నాయి.
ఆసియా క్రీడల క్రికెట్ మ్యాచ్‌ల షెడ్యూల్ వచ్చేసింది. జపాన్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్ డ్రా తీయగా.. భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో మిగిలిన వాటిని క్వార్టర్స్‌కు క్వాలిఫయింగ్ రౌండ్ కోసం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
The Asian Games 2026 women’s competition will start with the quarter-final fixtures pic.twitter.com/pVin8UIZX7
— Cricinfo (@cricinfo) July 24, 2026
గ్రూప్ ఏలో అఫ్గనిస్థాన్, జపాన్, నేపల్ ఉండగా.. గ్రూప్ బీలో హాంకాంగ్ చైనా, మలేషియా, ఒమన్ జట్లు నిలిచాయి. మహిళల క్రికెట్ విభాగంలో అవసరం లేకుండానే ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. నేరుగా నాకౌట్ పోరు నిర్వహించనుండగా టీమిండియాతో జపాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ విజేత బంగ్లాదేశ్, చైనా మ్యాచ్ గెలుపొందిన జట్టను ఢీకొట్టనుంది.
Bangladesh, India, Pakistan and Sri Lanka have gained direct entry into the knockouts of the Asian Games 2026 men’s competition https://t.co/WCS9T5YG9C pic.twitter.com/uP7s6xroNs
— Cricinfo (@cricinfo) July 24, 2026
ఆసియా క్రీడల్లో క్రికెట మ్యాచ్‌లు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు జరుగనున్నాయి. పురుషుల జట్ల మ్యాచ్‌లు సెప్టెంబర్ 24వ తేదీన మొదలై అక్టోబర్ 1వ తేదీన పూర్తవుతాయి. కానీ, మహిళల జట్ల మ్యాచ్‌లు మాత్రం ఆరు రోజుల్లోనే ముగియనున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 22 వరకూ మహిళల ఛాంపియన్ ఎవరో తేలియనుంది.