ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 5: ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతీ ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారంగా రూ.25,116ను ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ విరాళంగా అందజేశారు. శనివారం వసంత పంచమి సందర్భంగా తన చిన్న కుమారుడు గాదరి నిమిత్కు అక్షరాభ్యాసం చేయించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతీ ఆలయంలో తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయించడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సాయంగా అందజేస్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు వల్లమల్ల కృష్ణ, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్, ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్‌గౌడ్, జంగం అవినాశ్, నాయకులు జిల్లా శంకర్, కంచి రాజేశ్, శోభన్‌బాబు, జిల్లా నాగయ్య, మేకల రవి, కిశోర్, జానీ పాల్గొన్నారు.
సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణ భక్తులతో కిటకిటలాడింది.
సికింద్రాబాద్‌లో..
సికింద్రాబాద్, ఫిబ్రవరి 5: అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్, ఆర్జీఆర్ సిద్దాంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వసంత పంచమి పూజోత్సవాలు నిర్వహించారు. కాలేజేస్స్ ఫౌండర్, వైస్ చైర్మన్, కరెస్పాండెంట్ పీఎల్ శ్రీనివాస్, ఎవిఐఎస్ ప్రిన్సిపాల్ వనజ, ఆర్‌జిఆర్ సిద్దాంతి కాలేజీ ప్రిన్సిపాల్ సబిహా, బిఎడ్ ప్రిన్సిపాల్ స్వరూప, స్కూల్ అకాడమిక్ కో ఆర్డినేటర్ రచన, అకాడమిక్ ఇన్చార్జి మహేశ్వరి, అడ్మిన్ ఆఫీసర్ శ్రీధర్, సీసీఏ ఇన్చార్జి మణిదీప్ పాల్గొన్నారు.