దుండిగల్, జూన్ 23: దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల ‘రోబోటిక్స్‌పై పరిశోధన – అభివృద్ధి’పై ముందడుగు వేసింది. ఈ ఏడాది మార్చి 28న ఎంఎల్ఆర్ఐటీ కళాశా ల యాజమాన్యం హెచ్బీవోటీఎస్తో ఎంఓయూ కుదుర్చుకున్న నేపథ్యంలో గురువారం గచ్చిబౌలిలోని టీ హబ్ లో హెచ్- ల్యాబ్స్@ టీ హబ్ పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాసరావు మాట్లాడు తూ హెచ్బీవోటీతో కుదుర్చుకున్న ఒప్పందంతో తమ విద్యార్థులుకు రోబోటిక్స్‌పై పరిశోధన, అభివృద్ధి విషయం లో తీసుకునే చర్యలు, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించే విషయంలో మంచి తర్ఫీదు ఇవ్వనున్నామన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లకు సామాజిక సమస్యలను పరిష్కరించడంలో ఇది సహాయపడుతుందని, అదే విధంగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ల్యాబ్ విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సైతం ఇది దోహదపడుతుందని అన్నారు.
ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 24 కళాశాలలు మాత్రమే, ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని, ఇందులో ఎంఎల్ఆర్ఐటీ కళాశాల ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత గౌతమ్, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, ఏఐఎంఎల్ హెచ్‌వోడీ డాక్టర్ మధురవాణి పాల్గొన్నారు.