జూబ్లీహిల్స్, జూన్ 21 : దళితబంధు మహోన్నతమైన పథకమని, దళితుల జీవనస్థితిగతులను మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన గొప్ప పథకమని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. దళితులను ఉన్నత స్థానంలో నిలిపేలా ప్రవేశపెట్టిన ఈ పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మంగళవారం రహ్మత్‌నగర్ డివిజన్లో దళితబంధు లబ్ధిదారులకు ట్రాలీ వాహనాన్ని, సిమెంట్ మిల్లర్‌ను కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులకు అండగా నిలిచేలా.. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారన్నారు. దళితబంధు పథకంతో ఉన్నతస్థాయి జీవనోపాధి కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే గోపీనాథ్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, షరీఫ్, రవిశంకర్, లింగరాజ్, ధనుజ, స్రవంతి, రమ, నర్సింహ, నందు, ఫయాజ్, ముబీన్, మహేశ్, సాబేర్, సమద్, సురేందర్, విలియం, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.