శేరిలింగంపల్లి, జూన్ 17: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం శేరిలింగంపల్లి డివిజన్లో రూ.708.04 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. డ్రైనేజీ, విద్యుత్, ఇంటింటికీ తాగునీటి సరఫరా, రహదారుల నిర్మాణం తదితర వసతులు కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. పక్కా ప్రణాళికతో డివిజన్లవారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యంలేకుండా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తు ఈ రోజు పెద్ద ఎత్తున సీసీరోడ్లు, ఇతర అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ ముదిరాజ్, వీరేశంగౌడ్, మోహన్‌గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజుయాదవ్, నాయకులు నీరుడి గణేశ్ ముదిరాజ్, చింతకింది రవీందర్ గౌడ్లతో పాటు పలువురు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శంకుస్థాపన చేసిన పనుల వివరాలు
పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలి
నాలాల్లో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం సాయంత్రం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి నాలాను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షకాలంను దృష్టిలో ఉంచుకొని నాలా పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నాలాల రక్షణ చర్యల్లో భాగంగా ఫెన్సింగ్ వేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పూడికతీత పనుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్ తదితరులు పాల్గొన్నారు.