మెహిదీపట్నం, జూన్ 17 : జీహెచ్ఎంసీ పరిధిలో ‘ పట్టణ ప్రగతి ’ కార్యక్రమంలో భాగంగా నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో శుక్రవారం పరిశుభ్రత పనులను చేపట్టారు. నాంపల్లి నియోజకవర్గం విజయ్‌నగర్ కాలనీ డివిజన్ ఫిరోజ్‌గాంధీ నగర్లో ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్, ఎంఐఎం నాయకులు డాక్టర్ షేక్ఖాసీంతో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అదే విధంగా కార్వాన్ నియోజకవర్గం నానల్‌నగర్‌లో ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్‌తో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆసిఫ్‌నగర్ డివిజన్లో జీహెచ్ఎంసీ సర్కిల్ -12 ఈఈ లాల్‌సింగ్, డిప్యూటీ ఈఈ జమీల్లతో కలిసి ఎంఐఎం నాయకులు ఎండీ.మూసా సీవరేజీ, డ్రైనేజీ మరమ్మతులు పరిశీలించారు. మల్లేపల్లిలో ఎంఐఎం నాయకులు జాఫర్‌ఖాన్ పరిశుభ్రత పనులు చేయించారు.
కార్వాన్, నానల్‌నగర్‌లో… నానల్‌నగర్ డివిజన్లోని హకీంపేట్‌లో కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్, కార్వాన్లో కార్పొరేటర్ మందగిరి స్వామియాదవ్ పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. లంగర్‌హౌస్ డివిజన్లో ఎంఐఎం నాయకులు వజీఉజ్జమా సిద్ధికీ, ఏఈ కామేశ్వరి పనులను చేయించారు.