చార్మినార్, జూన్ 11: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) సమస్యలు పరిష్కరించేందుకు బస చేయాలన్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి శనివారం రాత్రి పురానాపూల్ పీహెచ్సీలో బస చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమీక్ష నిర్వహించి సమస్యలు ఆరాతీశారు. ఇక్కడ ప్రతినెల 35 నుంచి 40 సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని వెల్లడించారు.