భానుడు అస్తమిస్తున్న వేళ వినీలాకాశం నీలివర్ణంలో మురిపించింది. కొండపై కలియుగ వైకుంఠ క్షేత్రం, ఆ చెంతనే అన్ని హంగులతో నిర్మాణమవుతున్న సచివాలయం వెండి వెలుగుల్లో మెరిసిపోయాయి. ఈ అద్భుత దృశ్యం శనివారం సాయంత్రం హుస్సేన్‌సాగర్ వద్ద ఆవిష్కృతమైంది.