మల్కాజిగిరి, జనవరి 31: ఆస్తిపన్ను వేగంగా వసూ లు చేయడంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నారు. పన్ను చెల్లించడానికి మార్చి 31 వరకు అవకాశం ఇచ్చారు. అల్వాల్ సర్కిల్లో 2021-22 ఆర్థిక సంవత్సరాలనికి రూ.28 కోట్ల పన్ను వసులే లక్ష్యంగా నిర్ణయించారు.
ఇప్పటి వరకు రూ. 20.14 కోట్లు వసూలు ..
ఇప్పటి వరకు రూ. 20.14 కోట్లు వసూలు చేశారు. మిగిలిన రూ.7.86 కోట్ల పన్ను వసూలు చేయడానికి ఇండ్ల యజమానులను కలసి కట్టాలని డిమాండ్ నోటీసులు జారీచేశారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో 156 కాలనీలు, బస్తీలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 43,441 గృహాలు, అపార్టుమెంట్లతోపాటు వాణిజ్య భవనాలు ఉన్నాయి. దాదాపు 3లక్షల మంది నివసిస్తున్నారు. ప్రస్తు తం మార్చి 31 వరకు బకాయిలు రూ.7.86 కోట్లు వసూ లు చేయడానికి ఏర్పాట్లు చేశారు.
ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయడానికి అధికారుల కసరత్తు..
ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయడానికి ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, అసిస్టెంట్ బిల్ కలెక్టర్లు, ఏఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నా రు. సకాలంలో పన్ను చెల్లించాలని ఇండ్ల యజమానులపై ఒత్తిడి తెస్తున్నారు. కౌకూర్‌లోని వాటర్ ప్లాంట్ యజమాని రూ.8, 23, 057ను చెక్ ద్వారా చెల్లించాడు. అయితే చెక్ బౌన్స్ కావడంతో గత వారం డీసీ.. ప్లాంట్‌ను సీజ్ చేశారు. గత ఏడాది పన్ను చెల్లించకుండా ఎగనామం పెట్టిన వారికి రెడ్ నోటీసులు జారీ చేయనున్నారు.
ఆస్తి పన్ను చెల్లించడానికి ముందుకురావాలి
ఇండ్ల యజమానులు ఆస్తి పన్ను చెల్లించడానికి ముందుకురావాలి. సర్కిల్ కార్యాలయంలో పన్నులు చెల్లించాలి. ఆర్థిక సంవత్సరం 2021-22కి టార్గెట్ రూ.28 కోట్లుగా ఇచ్చారు. ఇప్పటి వరకు రూ.20.14 కోట్లు వసూలు చేశాం. మిగతా రూ.7.86 కోట్ల వసూలు కు కృషి చేస్తున్నాం. – నాగమణి, డిప్యూటీ కమిషనర్