కందుకూరు, జూన్ 11 : ప్రతి ఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని జైత్వారం గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. భక్తి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పురాతన దేవాలయాలను గుర్తించి అభివృద్ధి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రబైరు సదాలక్ష్మీ పుల్లారెడ్డి, చండీ ఉపసకులు రెవల్లి రాజూశర్మ, నాయకులు పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, సురుసాని సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, అందుగుల సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, జయ్యమ్మ రాజు, ఎంపీటీసీ సురేశ్, తాళ్ల కార్తిక్, సిద్ధు, పర్వతాలు, కట్టెకొముమల భూపాల్‌రెడ్డి, మాధవరెడ్డి, కొండల్‌రెడ్డి, పాండుగౌడ్, శ్రీశైలం, జగన్మోహన్రెడ్డి, జైపాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, బోజిరెడ్డి, వార్డు మెంబర్లు, భక్తులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలి
ప్రతి ఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల పరిధిలోని కోళ్లపడకల్ గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి ఉత్సవాల్లో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణరెడ్డి, ఎంపీటీసీ హనుమగల్ల చంద్రయ్య, ఎంపీపీ రఘుమారెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు థామస్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నర్సింహ గౌడ్, ఉపసర్పంచ్ ఆవుల కుమార్, నాగులదోని సర్పంచ్ మెగావత్ రాజూనాయక్, డైరెక్టర్లు సత్యనారాయణ, కడమోని ప్రభాకర్, పొల్కం బాలయ్య, నాయకులు మంత్రి రాజేశ్, జాన్‌రెడ్డి, సీతారాం నాయక్, గోపాల్ నాయక్, కోళ్లపడకల్, పోరండ్ల గ్రామ శాఖ అధ్యక్షులు రఘుపతి, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండ
పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా, బాధిత కుటుంబానికి భరోసాగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామకాలనీకి చెందిన రాములుకు మంజూరైన రూ.4 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం మంత్రి అందజేశారు. కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, టీఆర్ఎస్ నాయకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు.
సబితమ్మ సెల్ఫీ ప్లీజ్
సెల్ఫీ అంటే చిన్నా పెద్ద, అందరికీ క్రేజ్, మంత్రి హోదాలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి మండల పరిధిలోని జైత్వారం గ్రామానికి వచ్చినప్పుడు మేడం సబితమ్మ సెల్ఫీ ప్లీజ్ అంటూ.. చిన్న పిల్లలు కోరిన వెంటనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. శనివారం మండల పరిధిలోని జైత్వారం గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో చిన్నారులు, పిల్లలతో దరహసంతో సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు.