సెల్ఫీలు ఇవ్వలేను క్షమించండి!
సినీతారలు బయట కనిపిస్తే జనాలు ఫొటోల కోసం ఎగబడటం సర్వసాధారణం. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు సహకరిస్తే, మరికొందరు పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. ఇంకొందరైతే జనాలపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ప్రియాంక చోప్రాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
సినీతారలు బయట కనిపిస్తే జనాలు ఫొటోల కోసం ఎగబడటం సర్వసాధారణం. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు సహకరిస్తే, మరికొందరు పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. ఇంకొందరైతే జనాలపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ప్రియాంక చోప్రాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ముంబై ఏయిర్పోర్ట్లో తన కుమార్తెను ఎత్తుకుని సడెన్ ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక చోప్రా. ఒక్కసారిగా ప్రియాంకను చూడగానే సెల్ఫీల కోసం జనం ఎగబడ్డారు.
కానీ వారిపై ప్రియాంక కోపగించుకోలేదు. అందుకని సెల్ఫీలు కూడా ఇవ్వలేదు. ఒక్కక్షణం అగి.. ‘నేను నా పాపతో ఉన్నాను. ఇప్పుడు సెల్ఫీలు ఇవ్వలేను.. క్షమించండి’ అని చిరునవ్వుతో మర్యాదగా జనానికి నచ్చజెప్పి, అక్కడ్నుంచి చరచరా వెళ్లిపోయింది. ఈ విషయంలో ప్రియాంక ప్రవర్తన అక్కడున్న వారందరికీ బాగా నచ్చింది. అంతర్జాతీయంగా కీర్తి గడించి కూడా ఇంత ఒదిగి ఉండటం సామాన్యమైన విషయం కాదంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో
సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

