దుండిగల్/జీడిమెట్ల/గాజులరామారం,జూన్11: ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నదని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. శనివారం సూరారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీ,వేమారెడ్డినగర్,వైష్ణవినగర్, సోనియాగాంధీనగర్,శ్రీకృష్ణనగర్లలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం జలమండలి జీఎం శ్రీధర్‌రెడ్డి, ఈఈ గోవర్ధన్, డీఈఈ శిరీషా,ఎలక్ట్రికల్ ఏఈ రాజేశ్‌తో కలిసి పాదయాత్ర చేసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.శ్రీరామ్‌నగర్ కాలనీలో తాగునీటి సరఫరా,క రెంట్ కండక్టర్స్ ఏర్పాటు, డ్రైనేజీ ఔట్లెట్, ఇంటర్నల్ డ్రైనేజీ ఏర్పాటు, సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్లు ఏర్పా టు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.వేమారెడ్డి నగర్లోమిగిలిన ఉన్న కమిటీ హాలు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, వైష్ణవినగర్లో భూగర్భ డ్రైనేజీ, పంచతత్వ పార్కు ఏర్పాటు, విద్యుత్ కేబుల్ మార్పిడి, వీధి దీపాలు, అదనపు ట్రాన్స్ఫార్మర్, సీసీ రోడ్డు ప్యాచ్‌వర్క్‌లు, ఓపెన్ జిమ్ ఏర్పాటు తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
సోయాగాంధీనగర్లో డ్రైనేజీ సమస్య, శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కోరారు.శ్రీకృష్ణనగర్‌లో భూగర్భ డ్రైనేజీ ఔట్లెట్, కమిటీ హాలు,ఎలక్ట్రికల్ పోల్స్,హైమాస్ట్ లైట్,రెండు బోర్లు ఏర్పాటు చేయాలని,ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె నిర్మించాలని, సూరా రం గ్రామంలో డ్రైనేజీ సమస్య,శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాల్సిందిగాకోరగా సం బంధిత సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలేశ్,రాజు, వినోద్‌కుమార్, ఆయా కాలనీలు,బస్తీల సంక్షేమసంఘాల నేతలు పాల్గొన్నారు.
రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి రంగారెడ్డినగర్‌లో శనివారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్ బి.విజయ్‌శేఖర్‌గౌడ్ పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈ ఈ భాను,అధికారులు పూజిత,శంకర్‌నాయక్,ఉమారాణి,డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు శంకరయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్‌నగర్,వెంకటాద్రినగర్,వాసు లే అవుట్,40 ఫీట్ల రోడ్డు,వెంకటేశ్వర సొసైటీ,చివరి బస్టాప్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో మాజీ కార్పొరేటర్ జి.సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌లో శనివారం నిర్వహించిన పట్టణ ప్రగతిలో కార్పొరేటర్ జగన్ పాల్గొని పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమం లో ఎఎంసీ శ్రీనివాస్‌రావు, కాలనీ అధ్యక్షులు నర్సింగ్‌గౌడ్, నాయకులు మల్లారెడ్డి, హాజీ, ఆవుల నరసయ్య, ప్రభాకర్, రాజేందర్తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట కార్పొరేషన్ పరిధి 16వ డివిజన్లో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పాండు ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన పట్టణ ప్రగతిలో మేయర్ నీలాగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.స్థానికంగా మొక్కలు నాటి మేయర్ అనంతరం రూ.35 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఆయా కాలనీలు, బస్తీల్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఖాదరయ్య,కార్పొరేషన్ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్,వార్డు సభ్యుడు హనుమయ్య,బీసీ సెల్ ప్రెసిడెంట్ నరేష్, మహిళా ప్రెసిడెంట్ రజిత, విక్రమ్, మణికంఠ పాల్గొన్నారు.17వ డివిజన్లో కార్పొరేటర్ రాజుముదిరాజు ఆధ్వర్యంలో జరిగిన పట్ట ణ ప్రగతిలో మేయర్ నీలాగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్ఎన్డీపీ పనులను పరిశీలించారు.డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రవీందర్‌రెడ్డి,హరీశ్‌రెడ్డి, కృష్ణయ్య,కృష్ణ,సురేశ్,మల్లేశ్ ఉన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట్‌లోని 21,22 వార్డుల్లో కౌన్సిలర్లు లక్ష్మీఆంజనేయులు,షామీర్పేట్ సంధ్యహనుమంతరావుల ఆధ్వర్యంలో జరిగిన పట్టణ ప్రగతిలో కృష్ణవేణి కృష్ణవైస్ చైర్మన్ పద్మారావు, మేనేజర్ సునంద,ఇంజినీర్ ప్రవీణ్‌తో కలిసి హాజరయ్యారు.స్థానికంగా ఉన్న ఓపెన్ జిమ్,ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన చైర్పర్సన్ అనంతరం జరిగిన వా ర్డు సభల్లో సమస్యలపై చర్చించారు.డ్రైనేజీ మ్యా న్హోళ్లు,వాటర్పైపులైన్ల లీకేజీలకు మరమ్మతులు, శిథిలమైన విద్యుత్ స్తంభాలను స్థానంలో కొత్త వాటిని ఏర్పా టు చేయాలని,పాడుబడిన ఇండ్ల్లు, ఉపయోగంలో లేని బావులను పూడ్చాలని,రోడ్లపైకి వచ్చిన ట్రాన్స్ఫార్మర్లన పక్కకు తరలించాలని,రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు,చెత్తాచెదారాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని కృష్ణవేణి అధికారులను ఆదేశించారు.