కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 11 : కాలనీలు, బస్తీల్లో సంపూర్ణ స్వచ్ఛతను సాధించేందుకు పట్టణ ప్రగతిని నిర్వహిస్తున్నట్లు మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. శనివారం సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పట్టణ ప్రగతిని డీసీ రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత.. పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కొనసాగుతుందన్నారు. పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించడం, నాలాల్లో పూడిక తీయడం, వ్యర్థాలు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు దోమల నియంత్రణకు ఫాగింగ్, ఏఎల్వో ఆపరేషన్ పనులు సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏఎంహెచ్‌వో వెంకటగిరి, ఎస్ఎస్ మురళీధర్ రెడ్డి, ఎస్ఆర్పీ శ్రీనివాస్, ఎస్ఎఫ్ఏలు పాల్గొన్నారు.
ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయవద్దు..
ఖాళీ ప్రదేశాలు, నాలాల్లో చెత్తాచెదారం వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, ప్రజలు స్వచ్ఛత కోసం బాధ్యత తీసుకోవాలని కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేజ్ వసంతనగర్ కాలనీలలో నిర్వహించిన పట్టణ ప్రగతిని పరిశీలించారు. డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఏఎంసీ రమేశ్, టీపీఎస్ మహేందర్, ఎస్ఆర్పీ శ్రీనివాస్, ఎస్ఎఫ్ఏలు రవిరాజు, పవన్, పుల్లారావు, నేతలు రాణాప్రతాప్, హన్మంతరావు, రామ్‌గోపాల్, ఈశ్వర్ రెడ్డి, గంగూరి శ్రీనివాస్, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
పరిశుభ్రత అందరి బాధ్యత..
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం శేషాద్రినగర్ కాలనీలో పట్టణ ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్వచ్ఛత, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తుందన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరిరావు, బస్తీ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, శాంతాకుమార్ రెడ్డి, భీమ్రావు, లక్ష్మణ్‌రావు, మహేశ్, రాహుల్, రాజు, రాము, అధికారులు పాల్గొన్నారు.
లక్ష్యాన్ని చేరుకోవాలి..
చెత్తాచెదారం, వ్యర్థాలన్నింటినీ తొలగించి వందశాతం స్వచ్ఛత లక్ష్యాన్ని చేరుకోవాలని మాజీ కార్పొరేటర్ బాబురావు అన్నారు. బాలాజీనగర్ డివిజన్లోని కేపీహెచ్‌బీ కాలనీలలో పట్టణ ప్రగతిని ఆయన పరిశీలించారు. డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, లక్ష్మీరాజ్యం, దినేశ్ నాయుడు, భాస్కర్‌రావు, సుశీల్ న్నారు.
పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకుందాం
నివాస ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని వివేకానందనగర్, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ల కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్ పేర్కొన్నారు. పరిసరాలను మరింత మెరుగు పరుచుకునేందుకు పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్పొరేటర్లు తమ తమ డివిజన్ల పరిధిలోని కాలనీల్లో అవగాహన ర్యాలీ, శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం
కాలనీల్లోని సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కొనసాగుతుందని ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్ అన్నారు. డివిజన్ పరిధి ఆల్వీన్ సొసైటీలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణప్రగతి కార్యక్రమాన్ని శనివారం సీఓ ఇందిరాతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. డివిజన్ పరిధిలోని హస్మత్‌పేట్ హరిజన బస్తీలో అధికారులతో కలిసి ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షుడు ఐజాజ్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, డివిజన్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్, నర్సింగ్‌రావు, జాంగీర్, యాదగిరి, శ్రీను పాల్గొన్నారు.