అంబర్‌పేట/ కాచిగూడ/ గోల్నాక, జూన్ 11: పట్టణ ప్రగతి విజయవంతానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ప్రజలు ముందుకు వచ్చి తమ కాలనీల్లో నెలకొన్న స మస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ ఇంద్రప్రస్థకాలనీలో శనివారం పట్టణ ప్రగతి నోడల్ అధికారి రజిత నేతృత్వంలో నిర్వహించారు. కార్పొరేటర్ బి. పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వీధి దీపాలను ఏర్పాటు, చెట్ల కొమ్మలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు ఈ.ఎస్. ధనుంజయ, శ్రీరాములుముదిరాజ్, పి. చం ద్రశేఖర్, మిర్యాల రవీందర్, దారయోబు, రమేశ్‌నాయక్, కోట్ల సంతోష్, బాబుయాదవ్, శ్రీను, నరహరి, స్వామి, శివ, బీజేపీ నాయకులు చుక్క జగన్, జె. బాల్‌రాజ్, గోవర్ధన్‌రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.
చెత్తరహిత డివిజన్‌గా గోల్నాక..
చెత్త రహిత డివిజన్‌గా గోల్నాకను తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్యాశ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం గోల్నాక డివిజన్లోని దుర్గానగర్, కమలానగర్, అంబేద్కర్‌నగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో కలసి ఆమె పారిశుధ్యంపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నా రు. సీసీ రోడ్లు, మంచినీటి లోప్రెషర్, వెలగని వీధిదీపాలతో తా ము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు దృష్టికి తేగా.. సంబంధిత అధికారులతో మా ట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డివిజన్ వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణతో పాటు స్థానిక సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు మనోహర్, మల్లేశ్రాజు, సంతోష్, వెంకన్నతో పాటు బస్తీల నాయకులు అంజయ్య, నర్సింగ్‌రావు, రాజుగౌడ్, రాములు, మల్లేశ్, రాజ, విజయ్, మహేశ్, రేణుక పాల్గొన్నారు.
విజయవంతంగా పట్టణ ప్రగతి..
స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం చేస్తున్నామని కార్పొరేటర్ ఇ. విజయ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. శనివారం అంబర్‌పేట డివిజన్ ప్రేమ్‌నగర్ గ్రీన్‌ల్యాండ్ బస్తీలో పట్టణ ప్రగతిలో భాగంగా 9వ రోజు నిర్వహించిన కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో కలసి ఆయన పాల్గొన్నారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కాచిగూడ డివిజన్ అభివృద్ధే లక్ష్యం..
కాచిగూడ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాచిగూడ కార్పొరేటర్ ఉమాయాదవ్ అన్నారు. శనివారం కాచిగూడ డివిజన్లోని బర్కత్‌పుర తదితర కాలనీలలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పలు శాఖల అధికారులతో కలసి నిర్వహించారు. స్థానికులు పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని అధికారులను అదేశించారు. డీఎంసీ వేణుగోపాల్, డీఈ సువర్ణ, జలమండలి ఏఈ భావన, ఏఈ ప్రేరణ, వివిధ శాఖల అధికారులు, సుభాష్‌పటేల్, కృష్ణకుమార్, క్షీర్సాగర్, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.