ముషీరాబాద్/ చిక్కడపల్లి , జూన్ 11: బస్తీలు, కాలనీల్లో ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్, అంబేద్కర్‌నగర్, మోహన్నగర్లలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందితో కలిసి పర్యటించి ఫుట్‌పాత్‌లపై మట్టికుప్పలు, చెత్త తొలగింపు పనులు చేపట్టారు. అదేవిధంగా స్థానికులను నేరుగా కలిసి బస్తీల్లో నెలకొన్న సమస్యను వాకబు చేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు డ్రైనేజీ, మంచినీరు, రోడ్లకు మరమ్మతులు, వీధి దీపాలు వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆయా విభాగాల అధికారులను సద రు సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. నోడల్ అధికారి గీతాకుమారి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, ముఠా జయసిం హ, శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్, లక్ష్మణ్ గౌడ్, శివముదిరాజ్, అజయ్, గోవింద్, ఎయిర్టెల్ రాజు, ఉమారా ణి, శోభ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
అడిక్‌మెట్‌లో… అడిక్‌మెట్ డివిజన్లో జీహెచ్ఎంసీ వివిధ విభాగాల అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నోడల్ అధికారి రత్నారాణి, ఎఈ విశ్వేశ్, జ్యోతిర్మయి, టీఆర్ఎస్ నాయకులు సురేందర్, మహ్మద్ ఖదీర్‌లు పాల్గొని పారిశుధ్య పనులు చేపట్టారు.
ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు ..
ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని అన్నారు. శనివారం గాంధీనగర్‌లోని వీవీ గిరినగర్ బస్తీ, వాల్మీకి నగర్ బస్తీలలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎంహెచ్ఓ మైత్రేయి, నగర నాయకుడు వినయ్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు రత్నసాయిచంద్, విజయ, శ్రీకాంత్, ఉమేశ్,నవీన్‌కుమార్, మహమూద్, సంతోష్, ఆకుల అభిషేక్ పాల్గొన్నారు.
బాగ్‌లింగంపల్లిలో.. బాగ్‌లింగంపల్లి ప్రధాన రోడ్డు లో పట్టన ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ మురళి, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు రావులపాటి మోజస్ హాజరైన పరిసరాలను పరిశీలించారు. ఏఈ మురళి, ఎం.వి. జనార్దన్, శివకుమార్‌యాదవ్, ఎర్రం శేఖర్, కొండమడుగు మధు పాల్గొన్నారు.
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
చిక్కడపల్లి : సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘మీల్స్ ఆన్ వీల్స్’ కార్యక్రమంలో భాగంగా శనివారం సుందరయ్య పార్కు వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్. రాధాకృష్ణ, జూలూరి రఘు, సురేశ్ జగ్నాని, మెట్ల జగన్మోహన్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కాంచం ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యనారాయణగుప్తా, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.