కొండాపూర్, జనవరి 31 : నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారమందించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని చందానగర్ డివిజన్లో కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్, ఎలక్ట్రికల్ శాఖల అధికారులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారానందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు, తాగునీటి తదితర సమస్యలకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలపై చర్చిస్తూ పనులు చేపట్టేలా చూస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శ్రీకాంతిని, జలమండలి డీజీఎం నాగప్రియ, మేనేజర్లు సుబ్రహ్మణ్య రాజు, సునీత, ఏఎంఓహెచ్ కార్తిక్, టౌన్‌ప్లానింగ్ టీపీఎస్ మధు, ఎలక్ట్రికల్ ఏఈ రాజ్‌కుమార్, సురేందర్, ఎస్ఆర్పీ మహేశ్, బాలాజీ, వర్క్ఇన్స్పెక్టర్ హరీశ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణగౌడ్, నాయకులు మిరియాల రాఘవరావు, జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్, గోపి, నాగరాజు, రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
డ్రైనేజీ వ్యవస్థను విస్తరించాలని వినతి
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి ఎన్టీఆర్నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులు అన్ని బస్తీలకు విస్తరింపజేయాలని కోరుతూ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి సోమవారం కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. కేవలం కాలనీలోని కొన్ని బస్తీల్లో మాత్రమే పనులు కొనసాగుతున్నాయని, మిగతా అన్ని ప్రాంతాల్లోనూ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ టీఆర్ఎస్ నాయకులు బాలకృష్ణ, రవి, శ్రీను, ఎల్లేశ్, రమణ తదితరులు పాల్గొన్నారు.