గోల్నాక, జనవరి 31: నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, నాణ్యతా ప్రమాణాల్లో రాజీపడడం లేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం అం బర్పేట డివిజన్ పటేల్‌నగర్‌లో రూ. 6 లక్షల వ్య యంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైపులైన్ పనులను కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ పైపులైన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు.
అధికారులతో కలసి బస్తీలో పాదయాత్ర..
అనంతరం బస్తీలో పలు శాఖల అధికారులతో కలసి ఆయన పాదయాత్ర చేశారు. స్థానికుల సమస్యలను తెలుసుకుని, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పటేల్‌నగర్‌లోని పలు బస్తీల్లో కొనసాగుతున్న ఇంటింటికీ సర్వేను ఆయన పరిశీలించి, మెడికల్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో జలమండలి అధికారి కుశాల్, సిబ్బంది పాషా, ఉమేశ్, వైద్య సిబ్బంది డాక్టర్ గీత, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు, బస్తీ వాసులు పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ..
గోల్నాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వంజరి సంఘం ప్రతినిధి లవంగు ఆంజనేయులు ఆధ్వర్యంలో క్యాలెండర్‌ను కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వంజరి కులస్తుల సంక్షేమం కోసం కృషి చేసానన్నారు. రాష్ట్ర వంజరి సంఘం ప్రతినిధులు కాలేరు నరేశ్, అనంతుల అనిల్‌కుమార్, కాలేరు శ్రీనివాస్, లవంగు నాగరాజు, ఎంకే రాజు, ముజుకరి దినేశ్ పాల్గొన్నారు.