చార్మినార్, మే 20: పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ గంజా యి నుంచి తయారు చేసే హాష్ ఆయిల్‌కు అలవాటు పడ్డ ఇద్దరు యువకులు దానిని నగరంలో సైప్లె చేస్తూ పోలీసుల కు చిక్కారు. దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మీ వివరాలు వెల్లడించారు. విశాఖ జిల్లా అరుకు ప్రాంతానికి చెందిన సంజీవ(28), మహేశ్(20) వ్యవసాయం చేస్తూ స్థానికంగా గంజాయి, హాష్ ఆయిల్ అమ్మకాలు సాగిస్తుంటారు. వీరికి నగరంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతున్న రమేశ్ (27), ప్రేమ్ కుమార్(25) పరిచయమయ్యారు. అప్పటికే హాష్ ఆయిల్ సేవిస్తూ దానికి వ్యసనపరులుగా మారిపోయారు. ఉద్యోగాల వల్ల వచ్చే నెలవారి జీతాలు వా రి వ్యసనాలకు సరిపోక పోవడంతో హాష్ ఆయిల్‌ను నగరంలో అమ్మకాలు సాగిద్దామని ప్లాన్ వేసుకున్నారు. అందులో భాగంగా నిందితులు 8 నెలల కిందట అరకులోయకు చెందిన సంజీవ, మహేశ్‌లను కలిసి తమకు హాష్ ఆయిల్‌ను సరఫరా చేయాల్సిందిగా కోరారు.
నగరంలో ఉన్న డిమాండ్‌ను గుర్తించిన సంజీవ, మహేశ్‌లు రమేశ్, ప్రేమ్ కుమార్‌లకు 5 గ్రాముల హాష్ ఆయిల్‌ను రూ.1000లకు సైప్లె చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వైజాగ్ నుంచి తెచ్చిన హాష్ ఆయిల్‌ను నగరంలో రమేశ్, ప్రేమ్ కుమార్‌లు రూ. 2వేల నుంచి 2500 వరకు డిమాండ్‌ను బట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు లంగర్ హౌస్ వద్ద హాష్ ఆయిల్ అమ్మకాలు జరుగుతున్నాయని గుర్తించి అక్కడ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రమేశ్, ప్రేమ్ కుమార్ల వద్ద హాష్ ఆయిల్‌ను కొనుగోళ్లు చేయడానికి వచ్చిన గచ్చిబౌలి ప్రాంతవాసులు నితిన్(20), గణేశ్(26), అఖిల్(25)తో పాటు ప్రధాన నిందితులైన సంజీవ, మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 500 హాష్ బాటిళ్లతో పాటు 6 సెల్ఫోన్లు, వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ కోసం లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.