మైలార్‌దేవ్‌పల్లి, మే 20 : హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో భాగంగా అన్ని ప్రధాన రహదారులలో పా టు ఫ్లైఓవర్లు నిర్మించి వాహనదారులకు ట్రాఫిక్ సమ స్య లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. వేల కోట్ల రూపాయలను వెచ్చించి హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అన్ని విధాలా కృషిచేస్తున్నది. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లడానికి ట్రాఫిక్ చిక్కులు లేకుండా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లోని గగన్ పహాడ్ బెంగళూర్ ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న 6 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు రూ. 232 కోట్లతో చేపట్టింది. దీంతో వాహనదారుల ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుంది. ఇవి 2018 మేలో ప్రారంభించి ఇప్పటికి మూడు పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తెచ్చారు. బహదూర్ పూర, శివరాంపల్లి, గగన్ పహాడ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, సాతంరాయి, శంషాబాద్ ఫ్లైఓవర్లు నిర్మాణం చేపట్టగా మొదట వ్యవసాయ విశ్వవిద్యాలయం, సాతంరాయి, బహదూర్‌పుర ఫ్లైఓవర్లు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. మరో మూడు నిర్మాణంలో ఉండగా అందులో గగన్ పహాడ్ బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనులు పూర్తైతే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శరవేగంగా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నాం
ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా గగన్‌పహాడ్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా చేపడుతున్నాం. ఆగస్టులో పనులు పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తెస్తాం.శంషాబాద్ బ్రిడ్జి పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం.
– వెంకటేశ్వర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ డీఈ