బన్సీలాల్‌పేట్, మే 20 : సనత్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నెలబెట్టామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్‌పేట్ డివిజన్ పరిధిలోని పద్మారావునగర్, భోలక్‌పూర్, బోయిగూడ, గాంధీనగర్ ప్రాంతాలలో రూ. 3.82 కోట్ల తో పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్ కే హేమలతతో కలిసి ప్రారంభించారు. పద్మారావునగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద వీడీసీసీ రోడ్డు, బాపూజీనగర్‌లో కమ్యూనిటీ హాల్ అదనపు అంతస్తు నిర్మాణం, అభినవనగర్ కాలనీ, భోలక్‌పూర్, గాంధీనగర్, ఆంజనేయ కాలనీలలో వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. మంత్రి రాక సందర్భంగా స్థానికులు ఘన స్వాగతం పలికారు. సమస్యలను చెప్పగానే స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జలమండలి జీఎం రమణారెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు ఆంజనేయులు, ప్రవీణ్, సికింద్రాబాద్ తహసీల్దార్ బాలశంకర్, టీఆర్ఎస్ నాయకులు జీ పవన్‌కుమార్‌గౌడ్, కే లక్ష్మీపతి, వెంకటేశన్ రాజు, ఏసూరి మహేశ్, జీకే కాలనీ అధ్యక్షుడు కేఎం. కృష్ణ, కార్యదర్శి నర్సింగ్‌రావు, గాంధీనగర్ కాలనీ కార్యదర్శి రవికాంత్, బాపూజీనగర్ కాలనీ అధ్యక్షుడు బాలకృష్ణ, అభినవ్నగర్ కాలనీ అధ్యక్షుడు రాజేశ్‌గౌడ్, బెల్వదేర్ గార్డెన్స్ అధ్యక్షుడు జగ్గయ్య, ఎవర్గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, వెంకటాపురం కాలనీ అధ్యక్షుడు సంతోశ్‌రెడ్డి పాల్గొన్నారు.