గోల్నాక, మే 20: నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం గోల్నాక డివిజన్లోని తిరుమలనగర్‌లో రూ.17లక్షలతో సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ దూసరిలావణ్యశ్రీనివాస్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధన్యత ఇస్తున్నామన్నారు. అనంతరం బస్తీలో పాదయాత్ర చేస్తూ స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కరిస్తానని కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు తూర్పు రాంచందర్, సత్యనారాయణ, కృష్ణారెడ్డి, విశ్వనాథన్, శ్రీనివాస్, రఘుచందర్, మాధవి, లింగంగౌడ్, ఆర్కే బాబు, రాము, రాజు, మహేశ్, అరవింద్, శేఖర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
బాగ్‌అంబర్‌పేట డివిజన్ గౌడ సంఘం వెనుక గల్లీలో తాగునీటి లోప్రెషర్, కలుషిత తాగునీటి సరఫరా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. కొన్ని రోజులుగా కలుషితమైన తాగునీరు, లోప్రెషర్‌తో వస్తున్నదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. జలమండలి అధికారులు, సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం నల్లా వచ్చే సమయంలో బస్తీలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి నీటి సరఫరా ప్రెషర్‌ను స్వయంగా పరిశీలించారు. ఎక్కడెక్కడ కలుషిత నీరు వస్తుందో బస్తీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, బస్తీ నాయకులు అరుణ్‌కుమార్‌రెడ్డి, అనంత్, కెంచె మహేశ్, తదితరులు పాల్గొన్నారు.