సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ)/గోల్నాక : అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోల్నాక జంక్షన్ నుంచి ఛే నంబర్ జంక్షన్ వరకు ఈ నెల 20వ తేదీ నుంచి పనులు పూర్తయ్యే వరకు రోడ్డును మూసేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. కాగా, అంబర్‌పేటలో వాహనాల దారి మళ్లింపు రహదారులను ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ గురువారం పరిశీలించారు.
ఇలా వెళ్లాలి..
వరంగల్ వైపు నుంచి ఛేనంబర్ జంక్షన్ మీదుగా ఎంజీబీఎస్ వైపు వెళ్లే వాహనాలను ఉప్పల్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. ఈ వాహనాలు నాగోల్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ జంక్షన్‌కు చేరుకోవాలి.
సిటీ బస్సులు అంబర్పేట్ టీ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. ఈ వాహనాలు అలీకేఫ్ ఎక్స్‌రోడ్డు , జిందాతిలిస్మత్, గోల్నాక న్యూ బ్రిడ్జి వద్ద ఎడమ పక్కకు తీసుకొని.. నింబోలిఅడ్డా వైపు వెళ్లాలి.
చాదర్‌ఘాట్ నుంచి ఉప్పల్ వైపు
జిల్లా బస్సులు చాదర్‌ఘాట్ కాజ్‌వేపై నుంచి నల్గొండ క్రాస్‌రోడ్స్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్‌కు వెళ్లాలి. లేదా నింబోలిఅడ్డ జంక్షన్ నుంచి టూరిస్ట్ హోటల్, ఫీవర్ ఆస్పత్రి, విద్యానగర్, అడిక్‌మెట్, తార్నాక ఉప్పల్ వైపు వెళ్లవచ్చు.
సిటీ బస్సులు కోఠి నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలను రంగమహల్, చాదర్‌ఘాట్ జంక్షన్, డీఎంహెచ్ఎస్ జంక్షన్, బాటా, రామ్‌కోఠి ఎక్స్ రోడ్, కాచిగూడ, వైఎంసీఏ, రెడ్డి కాలేజీ బర్కత్‌పురా, ఫీవర్ ఆసుపత్రి, తిలక్‌నగర్, అంబర్పేట్ టీ జంక్షన్ లేదా అన్ని వాహనాలు గోల్నాక జంక్షన్ నుంచి గోల్నాక న్యూబ్రిడ్జి, అలీకేఫ్ మీదుగా వెళ్లాలి.
సిటీ బస్సులు తిలక్‌నగర్ జంక్షన్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే బస్సులు ఛే నంబర్ జంక్షన్ వద్ద అంబర్‌ఫేట్ టీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఆ వాహనాలు అలీకేఫ్, మూసారాంబాగ్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి.