సిటీబ్యూరో,మే 13 (నమస్తేతెలంగాణ) : మురికివాడలు లేని నగరాన్ని మార్చాలన్న లక్ష్యంతో పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 111 ప్రాంతాల్లో లక్ష డబుల్ ఇండ్ల నిర్మాణం లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు సుమారు 70 వేలకు పైగా నిర్మాణాలు పూర్తి చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గం బన్సీలాల్‌పేట బండమైసమ్మనగర్ వద్ద రూ 236.5 లక్షల వ్యయంతో 5 బ్లాక్‌లలో నిర్మించిన 310 డబుల్ బెడ్రూం ఇళ్లను ఆదివారం రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించనున్నారు.