కుత్బుల్లాపూర్, మే 13 : నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సకాలంలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయం వద్ద ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఇతర సమస్యలపై వినతి పత్రాలను అందించారు. పేట్ బషీరాబాద్‌లోని సర్వేనం.25/1 వినాయక్‌నగర్‌కు వడ్డెర బస్తీ చెందిన కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు కలుసుకొని పుష్పగుచ్ఛం అందించారు. వారివెంట కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, మాజీ ఎంపీపీ సన్న కవిత, బస్తీ అధ్యక్షుడు సంపంగి వెంకటేశ్, ఉపాధ్యక్షుడు సురేశ్, ప్రధాన కార్యదర్శి బాలమణి ఉన్నారు.
n కుత్బుల్లాపూర్ డివిజన్ పాపయ్యయాదవ్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి కాలనీల్లో సీసీ రోడ్లు పూరి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత అధికారులతో ఫోన్లైన్లో మాట్లాడి సకాలంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
n కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అపర్ణఫామ్గ్రూప్స్లో గోదావరి వాటర్ ట్యాంకు, పైపులైన్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, మాజీ ఎంపీపీ సన్న కవితతో కలిసి ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
n సుభాష్‌నగర్ డివిజన్ నజరేతు పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు సర్వేనం.107లో హిందూ, ముస్లిం, క్రైస్తవుల శ్మశానవాటిక కొరకు కేటాయించిన స్థలంలో క్రైస్తవులకు చెందిన స్థలంలో పలు నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా కృషిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
గాజులరామారం, మే 13 : గాజులరామారం డివిజన్ పరిధిలోని కైసర్ నగర్లో రైసింగ్ స్టార్ హైస్కూల్ వద్ద భూగర్భ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని బస్తీ వాసులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు మసూద్, ఉస్మాన్, సమీనా, అశోక్, ప్రసాద్, నాగరాజు, సబెర, తారదేవి, షేక్ జాకీర్ పాల్గొన్నారు.