మేడ్చల్ రూరల్, మే 8 : కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని ఆదివారం మేడ్చల్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో జిల్లా కోర్టు ఏర్పాటుకు సర్వే నంబరు 135లో కేటాయించిన ఐదు ఎకరాల్లో త్వరగా భవన నిర్మాణం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు చక్రపాణి, సభ్యులు మాణిక్‌రెడ్డి, వెంకటేశ్, మాజీ సర్పంచ్ జగన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల సరిహద్దు సమస్యను..
కట్టమైసమ్మ దేవాలయం, అలియాబాద్- శామీర్‌పేట గ్రామాల సరిహద్దు సమస్యను పరిష్కరించాలని గ్రామ పెద్దలు కోరారు. ఈ మేరకు మంత్రి మల్లారెడ్డికి ఆదివారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. శామీర్‌పేట చెరువుపై వెలసిన కట్టమైసమ్మ దేవాలయం, అలియాబాద్- శామీర్‌పేట గ్రామాల సరిహద్దుల విషయంలో సర్వే నిర్వహించకుండా శామీర్‌పేట గ్రామస్తులు అడుగడుగునా ఆటంకాలు చేస్తున్నారని తెలిపారు. సరిహద్దు సర్వే, దేవాలయం సమస్యను పరిష్కరించి అలియాబాద్ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.
పీర్జాదిగూడ: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డి.దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఆదివారం మంత్రి చామకూర మల్లారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.