Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, కౌంటింగ్ రోజున జూబ్లీహిల్స్ పరిధిలో ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఈ నెల 14న ఉదయం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం షాపులన్నీ మూసివేయాలని సీపీ ఆదేశించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నిక పోలింగ్ రోజున, ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఎవరూ గుమిగూడవద్దు అని సీపీ తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున రోడ్లు, జనావాసాల్లో టపాసులు పేల్చడం నిషేధం అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.