చాంద్రాయణగుట్ట, మార్చి 28: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CP CV Anand) గురువారం అర్ధరాత్రి పాతబస్తీలో పర్యటించారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం శబ్ ఏ కదర్ జగ్నే కీ రాత్ను పురస్కరించుకొని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీస్ ఉన్నత అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా దుకాణాల వారితో సీవీ ఆనంద్ పలు అంశాలపై ముచ్చటించారు. చివరి శుక్రవారం పురస్కరించుకొని ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
గత నెల 19న కూడా సైదాబాద్, సంతోశ్నగర్ తదితర ప్రాంతాల్లో సీవీ ఆనంద్ పర్యటించారు. శివరాత్రి, షబ్-ఎ-మెరాజ్ (జగ్నే కీ రాత్) పండుగలు ఒకే రోజు రావడంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఇతర సీనియర్ అధికారులతో కలిసి విధులు నిర్వహించారు.