బ్యాంక్ ఉద్యోగులు ఆ మెయిళ్లను క్లిక్ చేయడంతోనే.. రూ. కోట్లు కొట్టేశారు
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేశ్ బ్యాంక్‌పై సైబర్ దాడి కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్‌లో సైబర్ నేరగాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సీపీ తెలిపారు. బ్యాంక్ ఉద్యోగులకు రెండు ఫిషింగ్ మెయిల్స్ పంపించారు. ఆ ఫిషింగ్ మెయిల్స్‌ను బ్యాంకు ఉద్యోగులు క్లిక్ చేయడంతో, కంప్యూటర్ సిస్టంలతో హ్యాకర్లు అనుసంధానం అయ్యాయి. ఫైర్ వాల్స్ సరిగా లేకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బ్యాంక్ సర్వర్‌లో లోపాలున్నాయి. ఈ లోపాలను ఆసరా చేసుకొని నగదు బదిలీ చేసుకున్నారు. సర్వర్‌ను పకడ్బందీగా నిర్వహించడంలో మహేశ్ బ్యాంక్ విఫలమైందన్నారు.
హ్యాకింగ్‌కు ముందే ఖాతాలు తెరిచారు..
సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్‌కు ముందే ఖాతాలు తెరిచారు. జనవరి 23న సర్వర్ హ్యాక్ చేసి 4 ఖాతాల్లోకి నగదు నిల్వలను పంపించారు. సదరు ఖాతాల నుంచి పలు బ్యాంకుల్లోని 115 ఖాతాలకు, వాటి నుంచి మరో 398 ఖాతాలకు నగదు బదిలీ చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీలు ఉపయోగించారని తెలిపారు. ఒక ఐపీ స్విట్జర్లాండ్, మరొకటి కెనడాలో చూపిస్తోందన్నారు. ఈ హ్యాకింగ్ కేసులో మొత్తం 23 మందిని అరెస్టు చేశామని, ఇందులో నలుగురు నైజీరియన్లు ఉన్నారని తెలిపారు. స్టీఫెన్ ఒర్జి ప్రధాన హ్యాకర్‌కు సహకరించాడని పేర్కొన్నారు. ప్రధాన హ్యాకర్లు నైజీరియాలో ఉన్నారు. ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తామన్నారు. బ్యాంకులు సైబర్ సెక్యూరిటీని నిర్లక్ష్యం చేయొద్దు. మహేశ్ బ్యాంకు కేసులో దర్యాప్తు కోసం రూ. 58 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు రూ. 3 కోట్లు రికవరీ చేశారు. ఈ ఏడాది జనవరి 23న మహేశ్ బ్యాంక్ సర్వర్‌ను నిందితులు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

