బంజారాహిల్స్, జూన్ 17: మీకు యూనిఫామ్స్ అందాయా.. నోట్‌బుక్స్ ఇచ్చారా.. అంటూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన అడిగి తెలుసుకున్నారు. శ్రద్ధగా చదువుకుని పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని గత ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం జిల్లా కలెక్టర్ హరిచందన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్కూల్లో విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఏవైనా సమస్యలున్నాయా అంటూ ప్రశ్నించారు. యూనిఫామ్స్, నోట్‌బుక్స్ వచ్చాయా.. అంటూ వాకబు చేశారు. అన్ని క్లాసులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులచేత టెక్ట్స్ బుక్స్ చదివించారు. స్కూల్లో ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, టాయ్‌లెట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిశుభ్రకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని అద్యాపకులను ఆదేశించారు.