హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. మహిళలకు నిరంతరం రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో జెండర్ ఈక్వాలిటీ 2కే, 5కే రన్‌ను నిర్వహించనున్నారు. మార్చి 6వ తేదీన ఉదయం 5:30 గంటలకు పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్డు వద్ద ఈ రన్ నిర్వహించనున్నారు. ఈ రన్లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
రన్లో పాల్గొనాలకునే వారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. షీ టీమ్స్ ఆధ్వర్యంలో రన్ చేస్తున్న www.ifinish.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ల కోసం మార్చి 4న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న హాకా భవన్లో సంప్రదించాలని సూచించారు. రిజిస్ట్రేషన్లు మార్చి 5న సాయంత్రం 6 గంటలకు ముగియనున్నాయి.