Hyderabad | హైదరాబాద్ వీధుల్లో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. పాతబస్తీలో ఓ యువకుడు తన లవర్‌ను ఆటోలో ఎక్కించుకుని.. రోడ్లపై తిరుగుతూనే రొమాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం నాడు మలక్‌పేటలోని నల్గొండ చౌరస్తా నుంచి కోఠికి వెళ్తున్న ఓ ఆటోలో ఓ యువతిని డ్రైవర్ తనపై కూర్చొబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో రొమాన్స్ చేస్తూనే ఆటోను నడిపాడు. చాదర్‌ఘాట్ బ్రిడ్జిపైనా వీళ్ల రొమాన్స్‌ను చూసిన ఇతర వాహనదారులు ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో ఈ దృశ్యాలను తమ ఫోన్లో రికార్డు చేశారు. అయినప్పటికీ ఈ ప్రేమ జంట ఆగలేదు. ఎవరు చూస్తే మాకేంటి అన్నట్లుగా మరింత రెచ్చిపోయారు. అయితే ఇతర వాహనదారులు తీసిన వీళ్ల రొమాన్స్ వీడియోలను పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.
సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ దృశ్యాలు చాదర్‌ఘాట్ పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు ఆ మార్గంలోని సీసీటీవీ ఫుటేజిలను క్షుణ్నంగా పరిశీలించారు. సదరు ఆటో నంబర్‌ను గుర్తించి, రిజిస్ట్రేషన్ వివరాలను సేకరించారు. ఆ వాహనం నల్గొండ జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ కేబీ మురారి తెలిపారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నారని.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
Vehicle number TG 05 T 4061 pic.twitter.com/zvm79wtwSW
— Surya Reddy (@jsuryareddy) November 7, 2025