సిటీబ్యూరో: తెలంగాణ భవన్లో మంగళవారం ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరుకావాలని తలసాని కోరారు.